ram-gopal-varma-tweet-janasena-followers-over-his-new-movie amma rajyam lo kadapa biddalu (Photo-Varma Twitter)

Hyderabad, December 14: నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే క్రేజీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ramgopal varma) జనసేన కార్యకర్తలకు తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ఈ మధ్య విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సైతం కొన్ని సీన్లను తీసివేసింది. అయితే ఈ సినిమాపై ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు వర్మను చంపేశారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రాంగోపాల్ వర్మను కోడూరుపాడుకు(KODOORUPAADU) చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు(Janasena Followers) చంపేశారు. ఆయన చనిపోయినట్లు ఓ ఫ్లెక్సీని క్రియేట్ చేశారు. అందులో ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి చేకూరకూడదని భగవంతుని ప్రార్ధిస్తున్నాము' అని పేర్కొన్నారు.అన్‌పార్లమెంటరీ పదాలు వాడుతూ.. ఈనెల 26న వర్మ పెద్దకర్మ చేస్తున్నామంటూ బ్యానర్‌లో పేర్కొన్నారు.

Here's Varma Tweet

దీనిపై రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో కౌంటర్ (RGV Counter To Janasena Followers) వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన వర్మ... ‘ మీ లీడరును దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌(RGV Counter To Janasena Followers) చేశాడు. ‘పీకే, సీబీఎన్‌, లోకేశ్‌ మద్దతుదారులు.. నా వ్యతిరేకులు. అమ్మ రాజ్యంలో సినిమాను అర్థం చేసుకోండి. ఇది కేవలం వినోదం కోసం చేసినదే. నిజానికి నేను పీకే, సీబీఎన్‌, లోకేశ్‌ను ఎంతగానో ప్రేమిస్తాను. వారి అనుచరులందరూ ముఖ్యంగా కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.