Varma

Hyderabad, September 12: ఎప్పుడూ వివాదాల‌తో వార్త‌ల్లో ఉండే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma). ఆయ‌న మ‌రోసారి త‌న్ ట్విట్ట‌ర్ ద్వారా సినీ పెద్ద‌ల‌ను టార్గెట్ చేశారు. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి నేపథ్యంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దామని, కనీసం రెండు రోజులు షూటింగ్ లు ఆపుదామని ఆయన అన్నారు.  'మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం.

ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట

కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. నేను కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, పవన్ కల్యాణ్ కు, మహేశ్ బాబుకు, బాలయ్యకు, ప్రభాస్ కు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే... రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది' అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళికి కూడా ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశారు.