ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ముందే రణబీర్ కపూర్ డైలాగ్, ట్రెండింగ్‌లో యానిమల్‌ ప్రమోషనల్ స్టిల్స్‌
Ranbir shares stage with Balayya as he promotes 'Animal' on Unstoppable Season 3 (Photo-X)

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ యానిమల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి విదితమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో హిందితో పాటు అన్నీ బాషల్లో తెలుగు, తమిళం, కన్నడలో వచ్చే నెల డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.ప్రమోషన్స్ తో ఫుల్ బీజీగా యానిమల్ టీం గడుపుతుంది.

ప్రస్తుతం రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి టీం అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే (Unstoppable With NBK) ప్రోగ్రాంలో తెగ సందడి చేసారు. బాలకృష్ణతో హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి ఆ షో‌లో డ్యాన్స్ కూడా చేసారు. రణ్ బీర్ కపూర్ ఎంట్రీఅయ్యే ముందే ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని డైలాగ్ చెప్పగా.. అక్కడ సెట్స్ లో ఉన్న వారి ప్రశంసలను అందుకున్నది. ఇన్ సైడ్ నుంచి మంచి టాక్ వినపడుతుంది. అంతేకాదు రణ్ బీర్ కపూర్ తాత రాజ్ కపూర్, తన తండ్రి ాఎన్టీఆర్ గతంలో ఎలాంటి అనుబందం కొనసాగిందో కూడా చెప్పాడట బాలకృష్ణ. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేస్తారు అనే దానిపై ఆహా త్వరలోనే క్లారిటి ఇవ్వనుంది.

ప్రమాదవశాత్తు లారీ నుంచి జారీ కింద పడిపోయిన టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సెట్‌లో ప్రమాదం

ఆహాలో ఈ స్ట్రీమింగ్ కాబోయే స్పెషల్ ఎపిసోడ్ ను చాలా వినోదాత్మకంగా డిజైన్ చేసినట్టు ఇప్పటి వరకు నెట్టింట వైరల్ అవుతున్న స్టిల్స్ తాజాగా బయటకు వచ్చాయి. యానిమల్ చిత్రంలో బాబీ డియాల్, అనిల్ కపూర్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో సూపర్ థ్రిల్ అందించే విదంగా యానిమల్ ఉండబోతుందని ఇప్పటి వరకు విడుదల చేసిన రషెస్ చెప్తున్నాయి.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన నాన్న నువ్ నా ప్రాణం లిరికల్ సాంగ్.. అలాగే మిగిలిన రెండు పాటలు కూడా మంచి టాక్ క్రియేట్ చేసాయి. అయితే తండ్రి కొడుకులైన అనిల్ కపూర్-రణ్ బీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలతో కూడిన ఈ పాట అందర్ని భావోద్వేగానికి గురి చేస్తుందని విజువల్స్ చెబుతున్నాయి.