Khiladi Review: మాస్ రాజా రవితేజ నటించిన ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడి మూవీ ఎట్టకేలకు థియేుటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం అని క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. డైలాగ్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్, మూవీ లవర్స్ చెబుతున్నారు. ఖిలాడి మూవీ రివ్యూ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
కథ ఎలా ఉందంటే...
ఖిలాడీ చిత్రం పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సులు, పంచ్ డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. రవి తేజ ఈ సినిమాలో ఓ గ్యాంబ్లర్.. అంటే పెద్ద ఖిలాడీ మోహన్ గాంధీ పాత్రలో నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సర్జ కనిపించారు. హీరోయిన్ గా డింపుల్ హయతీ నటించారు. మనీ కంటెయినర్ ను మోహన్ గాంధీ దోచుకోవడంతో కథ స్టార్ట్ వుతుంది. పోలీస్ ఆఫీసర్ తో పాటు సినిమాలో విలన్లు కూడా ఆ కంటెయినర్ కోసం వెతుకుతుంటారు. మోహన్ గాంధీ… ఆ మనీ కంటెయినర్ లోనే కూర్చొని పోలీస్, విలన్లకు సవాల్ విసురుతుంటాడు.. సినిమాలో అంతర్లీనంగా ఉన్న మెయిన్ కాన్సెప్ట్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి
నటీనటులు పెర్ఫార్మెన్స్...
రమేశ్ వర్మ ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ కలిసి ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. రవి తేజ, అర్జున్ సర్జ, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, సుజిత్ వాసుదేవ్, జీకె విష్ణు సినిమాటోగ్రఫీని హ్యండిల్ చేయగా, అమర్ రెడ్డి కుడుముల ఎడింటింగ్ బాధ్యతలను తీసుకున్నారు.
సినిమా ఎలా ఉందంటే..
మొత్తం ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా ఇది. యాక్షన్ సీక్వెన్సస్ అద్భుతంగా వచ్చాయి. డైలాగ్స్ లో మంచి పవర్ ఉంది. రవి తేజ, అర్జున్ సర్జ, డింపుల్ హయతీ ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది.