Salman Khan Firing Case: స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్, పోలీస్ క‌స్ట‌డీలోనే ఉరేసుకొని చ‌నిపోయిన నిందితుడు
Anuj Thapan, Salman Khan (Photo Credits: X)

Mumbai, May 01: బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ ఇంటి వ‌ద్ద ఇటీవ‌ల కాల్పులు (Salman Khan Firing Case) క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. క‌స్ట‌డీలో ఉన్న నిందితుల్లో (Police Custody) ఒక‌రు బుధ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 32 ఏళ్ల అనూజ్ త‌ప‌న్ బుధ‌వారం ఉద‌యం బాత్రూమ్‌లోకి వెళ్లి బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. గ‌మ‌నించిన జైలు అధికారులు వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ అత‌డు మ‌ర‌ణించాడని పోలీసులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన అనూజ్‌ను ఏప్రిల్‌ 16న పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Salman Khan House Firing: సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల కేసు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు 

ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలో గ‌ల స‌ల్మాన్‌ఖాన్ (Salman Khan) నివాసం వ‌ద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గెలాక్సీ అపార్టుమెంట్ వ‌ద్ద‌కు బైక్ పై ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌చ్చారు. నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపి అక్క‌డి నుంచి ప‌రారు అయ్యారు. నిందితులు కాల్పుల అనంత‌రం ప‌రారు అయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల‌ను ప‌రిశీలించిన పోలీసులు నిందితుల‌ను విక్కీ గుప్తా, సాగ‌ర్ పాల్‌గా గుర్తించారు. నిందితుల్ని గుజ‌రాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆయుధాలు ఆరోపణలపై అనూజ్‌ తపన్‌, సోను సుభాశ్‌ చందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో అనూజ్ త‌ప‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.