Hyderabad, January 06: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh babu)హ్యట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే భరత్ అనే నేను’(Bharat Ane Nenu), ‘మహర్షి’ (Maharshi)సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు హ్యాట్రిక్ కొట్టేందుకు సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఎఫ్2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్, రష్మిక(Rashmika Mandanna) జంటగా లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’(Sarileru Neekevvaru)జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎఫ్2 సినిమాలో ‘అంతేగా.. అంతేగా’ అనే డైలాగ్‌తో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించిన దర్శకుడు ఈ సినిమాలో కూడా రష్మికతో ‘నీకు అర్థమవుతోందా..?’ అని ముద్దుముద్దుగా చెప్పించిన డైలాగ్‌తో ట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా అలరిస్తోంది.
‘పదిహేను సంవత్సరాల ప్రొఫిషనల్ కెరియర్ ఇంతవరకు తప్పును రైట్ అని కొట్టలేదు’ అని వార్నింగ్ ఇస్తూ విజయశాంతి (vijayashanti)చెప్పిన డైలాగ్ ఆకట్టుకున్నాయి. లేడి అమితాబ్ విజయశాంతికి మహేష్ బాబుతో ఇది రెండో సినిమా.. తొలి సినిమా కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ బాబు తండ్రి ఘట్టమనేని కృష్ణ సరసన హీరోయిన్ గా చేయగా అందులో బాలుడి క్యారక్టర్ లో మహేష్ బాబు నటించాడు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి ఆకట్టుకున్నారు. ఈ విషయం ట్రైలర్ ద్వారానే తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బండ్ల గణేష్(bandla ganesh) మెడలో బ్లేడ్ చైన్ వేసిన అనిల్ (Anil Ravipudi)ప్రేక్షకులకు బండ్ల నుంచి కావాల్సిందేంటో చెప్పకనే చెప్పేశాడు. ‘ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అంటూ రష్మిక అండ్ టీం చెప్పిన డైలాగ్‌తో సినిమాలో ఉన్న వినోదం రేంజ్ ఏంటో తెలిసిపోయింది.
ఇక ‘చిన్న బ్రేక్ ఇస్తున్నాను.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ అని ట్రైలర్ చివరలో మహేశ్ చెప్పిన డైలాగ్‌తో సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. మొత్తం మీద ట్రైలర్ చూశాక పూర్తిగా వినోదాన్ని రంగరించి తెరకెక్కించిన మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ అని స్పష్టమైంది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూశాక సంక్రాంతికి తమదే ‘హిట్టు బొమ్మ’ అని మహేశ్ అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.