SIIMA Awards 2019 Winners Announced I Photo Credits: Pantaloons SIIMA 2019 Official.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2019 వేడుకలు ఖతార్ దేశంలో అట్టహాసంగా ప్రారంభమైనాయి. దక్షిణ భారతదేశానికి చెందిన తెలుగు, కన్నడ, తమిళ మరియు మళయాల సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. ఉత్తమ నటుడు అవార్డును రామ్ చరణ్ గెలుచుకోగా రామ్ చరణ్ తరఫున మెగాస్టార్ చిరంజీవి ఆ అవార్డును అందుకున్నారు.

రెండు రోజుల వేడుకలో భాగంగా మొదటిరోజు తెలుగు మరియు కన్నడ చిత్రాలకు, నటులకు అవార్డులు అందజేశారు. తెలుగులో దాదాపు ఉన్న అవార్డులన్నింటినీ 'రంగస్థలం' సినిమా క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్న 'మహానటి' కీర్తి సురేష్ ఈ సైమా అవార్డుల్లో కూడా ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటుడు అవార్డును ఇండియాలో బాగా పాపులారిటీని సంపాదించిన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాకు అందుకున్నాడు. కన్నడలో కేజీఎఫ్ చిత్రానికి గానూ హీరో యష్‌‌కు ఉత్తమ నటుడు అవార్డ్ లభించింది.

తెలుగు విజేతల జాబితా..

ఉత్తమ చిత్రం: మహానటి

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (రంగస్థలం)

ఉత్తమ నటుడు: రామ్ చరణ్ (రంగస్థలం)

ఉత్తమ నటుడు విమర్శకుల ఎంపిక: విజయ్ దేవరకొండ (గీతా గోవిందం)

పాపులర్ సెలబ్రిటీ ఆన్ సోషల్ మీడియా అవార్డ్: విజయ్ దేవరకొండ

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (మహానటి)

ఉత్తమ నటి విమర్శకుల ఎంపిక: సమంత (రంగస్థలం)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (రంగస్థలం)

ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్(రంగస్థలం)

ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్ర ప్రసాద్ (మహానటి)

ఉత్తమ ఆరంభ నటి: పాయల్ రాజ్‌పుత్ (Rx 100)

ఉత్తమ ఆరంభ దర్శకుడు: అజయ్ భూపతి (Rx 100)

ఉత్తమ విలన్: శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)

ఉత్తమ లిరిసిస్ట్: చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (పిల్లా.. రా.. Rx 100)

ఉత్తమ గాయని: మానసి (రంగమ్మా.. మంగమ్మా.. రంగస్థలం)

ఉత్తమ సినిమటోగ్రాఫర్: రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ ఆర్ట్: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)