Hyderabad, July 18: ‘కలర్స్’ ప్రోగ్రాంలో (Colors Swathi) తన క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ లుక్స్ తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న స్వాతి అనంతరం ఆ ప్రోగ్రాంనే ఇంటిపేరుగా మార్చుకొని ‘కలర్స్’ స్వాతిగా మారడం తెలిసిందే. తర్వాత కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసిన ఈ నటి అనంతరం వివాహం (Marriage) చేసుకొన్నారు. ఇప్పుడు స్వాతికి సంబందించి ఓ సంచలన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వాతి త్వరలో భర్త నుంచి విడిపోనుందనేది దీని సారాంశం. ఇటీవల ఆమె తన ఇన్‌స్టా (Insta) అకౌంట్ నుంచి భర్త ఫొటోలు తొలగించేసిందని, విడాకుల దిశగా ఇది తొలి అడుగని నెటిజన్లు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. నిప్పు లేందే పొరగరాదని, విడాకులకు పూర్వం సమంత, నిహారిక కూడా ఇలాగే తమ భాగస్వాముల ఫొటోలను సోషల్ మీడియాలోంచి తీసేశారని గుర్తు చేస్తున్నారు.
గతంలో కూడా..
సుమారు రెండేళ్ల క్రితం కూడా సరిగ్గా ఇదే విధంగా స్వాతి విడాకులు తీసుకుంటోందన్న వార్త హల్ చల్ చేసింది. అప్పట్లో స్వాతి అకస్మాత్తుగా తన భర్త ఫొటోలు తొలగించడంతో కలకలం రేగింది. దీంతో, ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.