Nandamuri Taraka Ratna (Photo Credits: Twitter/@NTarakaRatna)

నందమూరి తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి మోహన కృష్ణ కుమారుడికి అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, నారా లోకేష్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తారకరత్న అంతిమ యాత్రలో బాలయ్యతోపాటు కుటుంబ సభ్యులు పాడెమోశారు. చంద్రబాబు కూడా అంతిమయాత్ర సాగుతున్న వాహనంలోనే వచ్చారు. విజయసాయిరెడ్డి కూడా తారకరత్న అంతిమసంస్కారాల్లో పాల్గొన్నారు. ఉదయం మోకిలాలోని నివాసం నుంచి చాంబర్‌కు భౌతికకాయాన్ని తరలించేప్పుడు పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్ని తారకరత్న కుమారుడి ద్వారా చేయించారు. చాంబర్‌ నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నప్పుడు మిగతా కార్యక్రమాల్ని ఆయన తండ్రి మోహనకృష్ణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి.

పక్క పక్కనే కూర్చున్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు, ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్, తప్పుబడుతూ కామెంట్

అబ్బాయ్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బాబాయ్‌ బాలయ్యలో తారకరత్న ఇక లేడనే బాధ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మొహం చిన్నపోయింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న క్షేమంగా బయటపతాడని బలంగా నమ్మినా విధిని తప్పించలేకపోయామనే బాధ కుటుంబసభ్యుల్లో కనిపిస్తోంది.