నందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళి అర్పించారు. కాగా ఈ ఇద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలను పక్కనబెట్టి జరగాల్సిన విషయాలపై చంద్రబాబు, బాలకృష్ణతో విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే, ఈ ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్.. రాజకీయంగా బద్ధశత్రువులైన బాబు, విజయసాయి ఒక్క చోట కూర్చోవడాన్ని తప్పు బట్టారు.

బతికితే సింహంలా బతకాలి, చనిపోతే సింహంలా పోవాలన్నారు. ‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్లిపోతా.. అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి’ అని ట్వీట్ చేశారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)