తమ్మారెడ్డి భరద్వాజ దర్శక నిర్మాతగా ఎన్నో సినిమాలను చిత్రీకరించాడు. భరద్వాజ ని ఒక యూ ట్యూబ్ చానల్ కి పిలిచి ఇంటర్య్వూ చేసారు. తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నిర్మించిన కోతలరాయుడు సినిమా గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను ఆ సినిమా తీయడం మా నాన్న గారికి ఇష్టం లేదు . అలాగే సినిమా తీయడానికి డబ్బులు కూడా అంతగా లేవని..అంతకు ముందు నుంచే నా కుటుంబం చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉందని తెలిపారు.
అలా అని ఊరుకోకుండా నేను కోతలరాయుడు సినిమా తీయడానికి డబ్బు బయట నుంచి తీసుకొచ్చాను. నాకు సినిమా గురించి అంతా అనుభవం లేకున్న .. ప్రొడక్షన్ నుంచి క్రాంతి కుమార్ గారి సహాయం తీసుకున్నాను. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. అందుకోసమని ఆయనను హీరోగా సినిమాలో తీసుకోవడం జరిగింది. అయితే ఆ సినిమా పేరే కోతలరాయుడు. హీరోయిన్ గా జయసుధ అయితే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడం వలన మాధవిని తీసుకున్నామని తెలియజేసాడు.
ఇకపోతే ఈ సినిమాలో మంజు భార్గవి చేసిన పాత్ర కోసం జయమాలిని అనుకున్నాము. కానీ ఆమె ఇచ్చిన డేట్స్ కి వీలు కుదరడం లేదు. అందువలన ఆ సినిమాలో జయసుధ-జయమాలిని నటించలేకపోయారు. కె. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అయినా కాని ఆ సినిమా నుంచి నేను అనుకున్నంత లాభాలు రాలేదు. నష్టాలు కూడా రాలేదు అని తమ్మారెడ్డి వ్యక్తం చేసాడు.