Vijay Deverakonda | File Photo

హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2019' (Most Desirable Man Of 2019) గా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రెండోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించబడిన వార్షిక ఓటింగ్స్ మరియు జ్యూరీ సభ్యుల రేటింగ్స్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రతీ ఏడాది లాగే 2019కి కూడా ప్రముఖ 'టైమ్స్ మ్యాగజైన్' 40 మంది పురుషులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ అత్యధిక రేటింగ్స్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 2వ స్థానంలో రామ్ చరణ్ తేజ్, 3వ స్థానంలో రామ్ పోతినేని (ఇస్మార్ట్ శంకర్), 4వ స్థానంలో ప్రభాస్, 5వ స్థానంలో సల్మాన్ జైదీ (ఎంటీవీ ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్ 2 విన్నర్), 6వ స్థానంలో బషీర్ అలీ- హైదరాబాద్ మోడెల్, 7వ స్థానంలో వరుణ్ తేజ్, 8వ స్థానంలో సుధీర్ బాబు, 9వ స్థానంలో ప్రదీప్ మాచిరాజు, 10వ స్థానంలో ప్రణవ్ చాగంటి (తెలుగు ర్యాపర్) నిలిచారు. ఇక అల్లు అర్జున్ 12వ స్థానం దక్కించుకున్నారు.

వివిధ రంగాలలో ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తూ ఎక్కువ ఫాలోయింగ్ ఉండే 45 ఏళ్ల లోపు పురుషులపై 'టైమ్స్ మ్యాగజైన్' ఓటింగ్ నిర్వహిస్తుంది. గతేడాది 2018లో కూడా విజయ్ దేవరకొండ అగ్రస్థానంలో నిలిచాడు. ఇలా వరుసగా రెండు సార్లు టాప్ ర్యాంక్ దక్కించుకున్న వారిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మహేశ్ బాబు కాగా, ఇప్పుడు విజయ్ దేవరకొండ.

Here's the update:

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పాన్-ఇండియా హీరోగా మారిపోయిన విజయ్, లవర్ బోయ్ క్యారెక్టర్‌లో తనదైన నటనను కనబరుస్తాడు. విజయ్ ఆఫ్ స్క్రీన్ స్టైల్, అటిట్యూడ్ మరియు మాట్లాడే విధానం కూడా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించింది.

ఇక రెండు సార్లు 'మోస్ట్ డిజైరెబుల్ మ్యాన్' ఘనత దక్కించుకున్న సందర్భంగా విజయ్ స్పందనను అడిగినపుడు విజయ్ మాట్లాడుతూ 'నేను అందరిలో ఒకడినే, అందరి లాంటి ఒక యువకుడు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన డ్రీమ్స్ అచీవ్ చేస్తుండటం మిగతా యూత్‌ని కనెక్ట్ చేసిందేమో, అందుకే వారు నాకు ఓట్ వేసి ఉండొచ్చు' అని విజయ్ అన్నాడు.

విజయ్ రీసెంట్ మూవీ 'World Famous Lover' కి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినా, యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో 'ఫైటర్' సినిమా తెరకెక్కుతుంది.