తెలుగు హీరోలకు ఇద్దరు హీరోయిన్లు, కొన్ని పాటలు, కొన్ని యాక్షన్ సీన్లు ఉంటే చాలు. వీళ్లకు యాక్టింగ్ రాదు, వీళ్లకసలు కొత్తగా ప్రయోగాలు చేయడం అంటేనే తెలియదు అనే విమర్శలు ఉండేవి. కానీ, విమర్శకుల నోళ్లు మూతపడేలా మన తెలుగు హీరోలు ఈ మధ్యకాలంలో తమ క్యారెక్టర్ పరంగా, కథల పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అంధుడిగా, చెవిటి వాడిగా ఇలా శరీరంలో ఏదో ఒక లోపం ఉన్న క్యారెక్టర్ ఎంచుకొని కూడా ఆ క్యారెక్టర్‌లో ఎంతో మంచి హీరోయిజం చూపించి తెలుగు హీరో చాలా పవర్‌ఫుల్ అని నిరూపించారు. వాటితో మంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు, లోపం కాదు శాపం అది కూడా దేవుడు ఇచ్చిన ఓ వరం, అదే అసలైన హీరోయిజం అనేలా అలాంటి వారిలో స్పూర్థినింపిన వారయ్యారు.
టాలీవుడ్‌లో 'ఛాలెంజింగ్' క్యారెక్టర్లు చేసిన హీరోలు.
నాగార్జున- ఊపిరి
టాలీవుడ్ మన్మధుడిగా గుర్తింపు పొందిన 'కింగ్' నాగార్జున ఊపిరి సినిమాలో రెండు కాళ్లు లేని వాడిగా, సినిమా మొత్తం వీల్ చైర్ లోనే నటించాడు. ఒక స్టార్ హీరో, అందులోనూ గ్లామర్ హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా గ్రేట్. అందుకే నాగార్జున టాలీవుడ్ కింగ్.
ఎన్టీఆర్- జై లవకుశ
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ చేసిన జై పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మాట్లాడేందుకు ఇబ్బందిపడే నత్తి క్యారెక్టర్ లో కూడా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి తన నటవిశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రలో లోపం ఉన్న జై క్యారెక్టరే పవర్‌ఫుల్.
ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రాన్ని దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ధ్‌దదాఆ..యిర్యం ఉండాలా..!
రామ్ చరణ్ - రంగస్థలం
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంలో చెవిటి వాడుగా అభినయించిన విధానం, విమర్శకులను సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది.
చిట్టిబాబు చెవుల్లోకి మాటెళ్లడం కష్టమే కానీ, ఒక్కసారి వెళ్లిందంటే అది అక్కడే ఉండిపోద్ది అయ్యా.
రాజా ధి గ్రేట్
మాస్ మహారాజా రవితేజ కళ్లు లేనివాడిగా నటించి రవితేజ ది గ్రేట్ అనిపించుకున్నారు.
ఐ యామ్ బ్లైండ్.. బట్ ఐయామ్ ట్రైన్డ్
అంధగాడు సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా కొంత భాగం సినిమాలో చూపు లేనివాడిగా నటించారు.