#SirivennelaSeetharamaSastry: ఐసీయూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సినీ గేయ రచయిత, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపిన కిమ్స్ యాజమాన్యం
sirivennela seetharama sastry health bulletin (Photo-File and twitter )

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో (Secunderabad Kims Hospital) చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ (writer sirivennela seetharama sastry health bulletin ) విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో (sirivennela seetharama sastry health Update) బాధపడుతున్నారు.

ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మా నాన్న బతికే ఉన్నాడు, ఆ చావు వార్తలు ఆపండి, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరిన కైకాల స‌త్య‌నారాయ‌ణ కూతురు, ఆయన కోలుకుంటున్నారని వీడియో ద్వారా వెల్లడి

కిమ్స్ ఆస్పత్రి ఇచ్చిన అప్ డేట్ లో ... టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. నవంబర్ 24న న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సిరివెన్నెల త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నాము. సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం ” అని వైద్యులు తెలిపారు.

Here's Update

సిరివెన్నెల సీతారామశాస్ర్తి తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్ధాలుగా సేవలను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన జర్నీలో ఎన్నో సూపర్ హిట్ పాటలను రచించిన సిరివెన్నెల స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.