Bunny Vasu Writes to Sundar Pichai: ఇంటర్నెట్ స్వేచ్ఛ..దీంతో నేను నరకం చూశాను, గూగుల్ సీఈఓకి టాలీవుడ్‌ సినీ నిర్మాత బన్నీ వాసు లేఖ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్మాత లేఖ
Tollywood Producer Bunny Vasu (Photo-Facebook)

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ (Bunny Vasu Writes to Sundar Pichai) రాశాడు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛ కారణంగా సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు లేఖలో వెల్లడించారు. తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని బన్నీవాసు నేరుగా సుందర్‌ పిచాయ్‌ని ప్రశ్నించారు .

ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని, అదేంటో స్వయంగా తాను ఫేస్‌ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Google CEO Sundar Pichai) చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బన్నీ వాసు (Tollywood Producer Bunny Vasu) ఈ లేఖ రాశారు. ప్రస్తుతం బన్నీ వాసు లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు, రాజ్ కుంద్రా భార్య బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని విచారించిన సీబీఐ పోలీసులు, రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించిన ముంబై మేజిస్ట్రేట్ కోర్టు

‘సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నా ఆలోచనా విధానాలు, భావాలు పంచుకోవటానికి ఇది మంచి వేదిక అవుతుందని నమ్మాను. భావప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని భావించాను. కానీ.. గడిచిన రెండేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వల్ల మానసికంగా నేను పడ్డ క్షోభను తెలియచేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను’ అని వివరించారు.

‘సామాజిక మాధ్యమాల్లో ఉంటున్న వాళ్లందరూ విచక్షణతో ఉంటున్నారా? విచక్షణ ఉన్న వాళ్లనే సామాజిక మాధ్యమాల్లోకి అనుమతిస్తున్నారా? అబద్ధాలు, అసత్యాలను పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బందిపెడ్తున్న వాళ్లది తప్పా?.. లేదా అలాంటి వాళ్లు చేస్తున్న క్రూరమైన పనులను నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా?’ అంటూ బన్నీవాస్‌.. సుందర్‌ పిచాయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ వాస్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా షూట్‌ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.