Shilpa Shetty and Husband Raj Kundra (Photo Credits: Twitter)

పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్‌ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని (Crime Branch Questions Shilpa Shetty) శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె (Actress Shilpa Shetty) స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను (Raj Kundra) వెనకేసుకొచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజ్‌కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్‌’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్‌’ కాదని ఆమె అన్నట్లు సమాచారం.

కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్‌(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుంద్రా పేర రిజిస్ట్రర్‌ అయిన యస్‌ బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆఫ్రికా ఖాతాల లావాదేవీలను రికార్డు చేశామని వెల్లడించారు. దీంతో పాటుగా భారీ ఎత్తున డేటాను తొలగించినట్లు తేలిందని, దాన్ని వెలికి తీసేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు చెప్పాయి.

పోర్నోగ్రఫీ కంటెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 7.5 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. కుంద్రా తన సంస్థ వియాన్‌ ద్వారా ముంబయిలో అశ్లీల చిత్రాలు నిర్మించి బ్రిటన్‌లోని తన బంధువు సాయంతో అక్కడి నుంచి హాట్‌షాట్స్‌ అనే యాప్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారన్న అభియోగాలతో ఈనెల 19న ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అవి పోర్న్ వీడియోలు కావు, మేము అసలు సెక్స్ వీడియోలే చేయలేదు, ముంబై పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై స్పందించిన నటి గెహనా వశిష్ట్‌

ఇక పోర్న్‌ చిత్రాల నిర్మాణం కేసులో(Porn Films Case) అరెస్టైన రాజ్‌ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాను నిర్మించిన సినిమాలు పోర్న్‌ చిత్రాల కిందకు రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందులో పాత్రధారుల వాంఛను వ్యక్తపరిచే సన్నివేశాలే తప్ప, నేరుగా లైంగిక ప్రక్రియను చూపించే దృశ్యాలు లేవని తెలిపారు. కాబట్టి తనను ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67ఏ(అశ్లీల సమాచార ప్రచురణ, ప్రసారం) కింద అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు.

ఈ నెల 23 వరకు పోలీస్‌ కస్టడీలో రాజ్ కుంద్రా, నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా

దీంతోపాటు తనకు ముందస్తు నోటీసులు ఇచ్చి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్‌ కస్టడీని విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు శిల్పాశెట్టిని విచారించారు. శుక్రవారం కుంద్రాను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్లి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని వెళ్లారు. అంతకు ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు చర్చనీయాంశం అయింది. గతంలో తాను ఎన్నో సవాళ్లను అధిగమించానని, ఇప్పడూ వాటిని ఎదుర్కొంటానని.. తన జీవితాన్ని ఏదీ ప్రభావితం చేయలేదని అందులో వ్యాఖ్యానించారు.

ఈజీ మనీ కోసం యువతులతో పోర్న్ చిత్రాలు, పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ముంబై పోలీస్‌ కమిషనర్‌

కుంద్రా అరెస్టు సమయంలో 23 వరకూ పోలీస్‌ కస్టడీని విధించిన మేజిస్ట్రేట్‌ కోర్టు శుక్రవారం దాన్ని 27 వరకూ పొడిగించింది. దీన్ని కుంద్రా హైకోర్టులో సవాల్‌ చేశారు. తనపై పెట్టిన సెక్షన్ల కింద 7 ఏళ్లకు మించి జైలు శిక్ష పడదని, అలాంటి సందర్భాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.