Sai Pallavi Clarification: కశ్మీరీ ఫైల్స్ వ్యాఖ్యలపై సాయిపల్లవి క్లారిటీ, వీడియో మొత్తం చూసి మాట్లాడాలంటూ హితవు, ట్రోలర్స్ నోర్లు మూయించిన లేడీ పవర్ స్టార్

Hyderabad, June 18: అందాల భామ సాయి పల్లవి (Sai Pallavi) తాజాగా విరాటపర్వం (Virata parvam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి (Sai Pallavi) ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఆమెను వివాదంలోకి నెట్టేశాయి. కాశ్మీర్ ఫైల్స్ (Kashmiri Files) చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని.. అలాగే ఆవులు తరలిస్తున్నారని కొందరు ముస్లింలపై దాడిని కూడా తాను చూడలేకపోయానని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్‌తో కొందరు ఆమెపై తీవ్రంగా మండి పడుతున్నారు. ‘‘కశ్మీరి పండితులపై దాడి.. ఆవులు తీసుకెళ్లే వ్యక్తిపై దాడి నీ ఉద్దేశ్యంలో ఒకటేనా..?’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

దీంతో సోషల్ మీడియాలో (Social Media) ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాజాగా సాయి పల్లవి తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. తాను ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను కొంతవరకే క్లిప్పింగ్ గా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని.. తనకు హింస అంటే నచ్చదని.. అది ఎలాంటిదైనా తాను దానిని పూర్తిగా వ్యతిరేకిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Case Against Sai Pallavi: నటి సాయి పల్లవిపై పోలీసు కేసు నమోదు, విరాట పర్వం మూవీని అడ్డుకుంటామంటూ భజరంగ్ దళ్ హెచ్చరిక, అసలు సాయి పల్లవిపై కేసు ఎందుకు పెట్టారో తెలుసా?  

అయితే తాను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూస్తే, తాను ఆ కామెంట్స్ ఎందుకు చేశానో అర్థమవుతుందని, అంతేగాని ఒక క్లిప్పింగ్ మాత్రమే చూసి తనపై ఇలా ట్రోలింగ్ (Trolling) చేయడం కరెక్ట్ కాదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి సమయంలో కూడా తన వెంటే ఉన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపింది ఈ బ్యూటీ. ఇకపై తానేదైనా విషయాన్ని మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని మాట్లాడుతానని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఏదేమైనా సాయి పల్లవి ఇచ్చిన క్లారిటీతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.