 
                                                                 Hyderabad, June 16: అందాల భామ సాయి పల్లవి (Sai Pallavi)నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’ (Virata parvam) మరికొద్ది గంటల్లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆమె వెన్నెల (Vennela) అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుండగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి (Rana) ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు ఓ దిమ్మతిరిగే షాకిచ్చారు భజరంగ్‌దళ్(Bajarangdal) నాయకులు. ఇటీవల విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి (Sai pallavi)కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా భజరంగ్‌దళ్ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని, సాయి పల్లవిపై తగు చర్యలు తీసుకోవాలంటూ భజరంగ్‌దళ్ నాయకులు హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓ మీడియా ఛానల్‌కు సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘కశ్మీర్లో పండితులను (Kashmir pandits) చంపడం, ఆవు పేరుతో ముస్లింలను చంపడం.. ఈ రెండింటికీ తేడా ఏముంది’’ అంటూ ఆమె ప్రశ్నించింది.
దీంతో భజరంగ్‌దళ్ నాయకులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమె నటించిన విరాటపర్వం సినిమాను తాము అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను ఆమె వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై సాయి పల్లవి ఎలా స్పందస్తుందో చూడాలి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
