Hyderabad, Feb 12: హీరో విశాల్‌ (Vishal) గాయపడ్డాడు. తన కొత్త సినిమా షూటింగ్ లో ఓ రిస్కీ షాట్ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. భారీ స్టంట్ సీక్వెన్స్ లో పాల్గొంటుండగా ఆయన కుడి చేతికి, చేతి వేళ్లకు పలు చోట్ల రక్తం కారుతూ గాయాలు (major injury) కావడంతో.. షూటింగ్ కు టెంపరరీగా ప్యాకప్ చెప్పేశారు. ఇంటర్నల్ గా గాయాలు అవ్వడం, ఎముకల్లో బ్రేక్ కనిపించడంతో కొద్దిరోజుల పాటు ప్రత్యేక చికిత్స అవసరం అని డాక్టర్లు సూచించారు. దీంతో విశాల్ కేరళకు (Kerala) వెళ్లారు. ఆయన కొత్త మూవీ లాఠీ కి (Laththi) సంబంధించిన మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లోనే (Hyderabad) జరుగుతోంది. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ (Peter hains) ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కొద్దిరోజులుగా చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శాంపిల్ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో విశాల్ పోస్ట్ చేశాడు.

ఓ భారీ అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఓ చిన్న పిల్లాడిని పట్టుకుని బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాల్సిన షాట్ ను డూప్ లేకుండా విశాల్ చేశాడు. సీన్ లో భాగంగా నిజమైన రాళ్ల పైన దూకాల్సి రావడంతో.. విశాల్ డేర్ చేశాడు. ఈ రిస్కీ షాట్ లో.. రాళ్లపైన పడటంతో విశాల్ కుడి మోచేయి, చేతివేళ్ల ఎముకల్లో వెంట్రుక వాసి పగుళ్లు వచ్చాయి. పెయిన్ ఎక్కువగా ఉండటంతో 3 వారాల పాటు ప్రకృతి వైద్యం అవసరం కావడంతో ఆయన కేరళకు వెళ్లారు. మార్చి తొలి వారంలో మొదలయ్యే ‘లాఠీ’(Laththi)చివరి షెడ్యూల్ షూటింగ్ లో మళ్లీ పాల్గొంటానని విశాల్ తన ట్వీట్ లో చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘లాఠీ’(Laththi) మూవీ తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో మూవీని సమ్మర్ ట్రీట్ గా మే ఐదున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. దర్శకుడు ఎ.వినోద్ కుమార్ కు ఇది తొలి సినిమా. సునయన కథానాయిక. ప్రభు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. విశాల్‌ కు గాయాలయ్యాయనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు.