New Delhi: "భారతీయ సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు ఇంకా చాలా భాషా చిత్రాలు ఉన్నాయని, అవి విభిన్న భారతియ శైలిని, సంస్కృతి ని సూచిస్తున్నాయని " టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్ఎఫ్) యొక్క ఆర్టిస్టిక్ డైరెక్టర్ & కో-హెడ్ కామెరాన్ బెయిలీ అన్నారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ "అఖిల భారత సెషన్‌ను" టిఐఎఫ్‌ఎఫ్‌  ఇటీవల నిర్వహించింది. భారత ప్రతినిధి బృందంలో పాల్గొనేవారికి స్నేహపూర్వక విధాన కార్యక్రమాలు ఇక భారతదేశంలో చిత్రీకరణ కోసం ఫ్రేమ్‌వర్క్ గురించి మరియు సింగిల్-విండో మెకానిజం ద్వారా షూటింగ్ కోసం క్లియరెన్స్ పొందే ప్రక్రియ, విధానం గురించి ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.

ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవ సంచికతో పాటు చలన చిత్రోత్సవాలకు భాగస్వామ్యాన్ని ఈ ప్రతినిధి బృందం ఆమోదం తెలిపింది.

వివిధ కళా శైలులు, భాషలు మరియు ప్రాంతీయ రుచులతో కూడిన భారతీయ సినిమా యొక్క గొప్పతనo గురించి బెయిలీ ఈ సందర్భంగా మాట్లాడారు. భారతీయ సినిమాలు చాలా  పెద్ద ఎత్తున సంగీత, యానిమేషన్, తీవ్రమైన నాటకియ్యత కలిగిన సినిమాలు తియ్యడంలో దిట్ట అని మరియు కామెడీలు అద్భుతంగా నిర్మిస్తున్నాయని, అవి ఇండియా లాంటి దేశాల్లో తప్ప మరే ఇతర దేశాల్లో చెయ్యడం లేదని బెయిలీ అభిప్రాయ పడ్డారు.

భారతదేశం లో ‘నావిగేషన్ సౌలభ్యం’ చాలా బ్రహ్మాండంగా ఉన్నందున, దేశం అంతటా షూటింగ్ చేసుకోవడానికి అనుమతుల ప్రామాణీకరించడానికి విధాన మార్పులు అవసరమని మరియు అంతర్జాతీయ చిత్రనిర్మాతలను ఆహ్వానించడానికి, సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

షూటింగ్ అనుమతులను వేగంగా ప్రాసెస్ చేయడానికి రాష్ట్రా మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నోడల్ అధికారుల పర్యవేక్షణ వ్యవస్థను నియమించడం కూడా చాలా అవసరమని ఈ సమావేశంలో సూచించడం జరిగింది. ఈ సందర్భంగా ఇతర దేశాలు ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 లో (భారత దేశంలో) పాల్గొనడానికి తమ అంగీకారం తెలిపాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది.