PAPPU LAANTI ABBAYI In KRKR: ఎవరీ పప్పు లాంటి అబ్బాయి, కెఆర్‌కెర్‌లో మరో పాటను విడుదల కాంట్రవర్సీ డైరక్టర్ వర్మ, ఇప్పటికే పాల్ మీద సాంగ్ విడుదల, పాత్రలను యాదృచ్చికంగానే చూడాలంటున్న వర్మ
kamma rajyamlo kadapa reddlu Rgv Pappu lanti abbayi song teaser (Photo-Twitter)

Hyderabad, November 10: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు(Kamma Rajyamlo Kadapa Reddlu) అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి అందిరీ తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో మారో పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

పప్పులాంటి అబ్బాయి(Pappu Laanti Abbyi In KRKR)..శుద్ధ పప్పు చిన్నారి..బాధ నేను పడుతున్నా..చెప్పుకోలేకున్నా..అంటూ సాగే ఈ పాటను పరమ బ్రహ్మ ముహూర్తం..2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం 9.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సైకిల్ ఛైన్ తెగితే..దాని లింక్ చేస్తా..పచ్చనైన మా డాడి..సైకిల్ పట్టి వేలాడి..ఏడవద్దు..పొర్లాడి..అంటూ సాగే ఈ సాంగ్ ఇంతకు ముందు విడుదల చేసిన పాల్ సాంగ్ లాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విట్టర్లో విడుదల చేసిన వర్మ

ఇదిలా ఉంటే వర్మ(Ram Gopal Varma) సినిమా చూసిన తర్వాత ఎవరైనా భుజాలు తడుముకోవచ్చని, ఎవరినైనా పోలినట్లు ఉంటే అది యాదృచ్చికం మాత్రమేనని ప్రకటించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఏపీలో కుల రాజకీయాలు ఆజ్యం పోస్తుందని టైటిల్ వెంటనే మార్చేయాలని సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేస్తున్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్‌‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

అయినప్పటికీ వర్మ పట్టు విడవకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.  కెకెఆర్‌ఆర్‌లోకి రాజమౌళిని లాగిన రాంగోపాల్ వర్మ

ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, సాంగ్స్ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇటీవలే కేఏ పాల్‌పై ఓ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన పప్పులాంటి అబ్బాయి అబ్బాయి సాంగ్ టీజర్‌లో.. తాతగారి సైకిల్ లాక్కొని తొక్కుతున్నావు..నన్ను కూడా ఎక్కి తొక్కుమంటున్నావు..నాకు అంత సరదా లేదు..నన్ను విడిచిపెట్టు..నీకు కూడా అంత వయస్సు లేదు..సైకిల్‌ను వదిలివేయవచ్చు..కదా..అంటూ సాంగ్ సాగింది.

ఇప్పటికే ఈ సినిమాపై అనేక వివాదాలు నడుస్తుండగా.. విడుదలైన ఈ సాంగ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పప్పులాంటి అబ్బాయి పాత్ర ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిని ఉద్దేశించినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలోని పప్పు లాంటి అబ్బాయి క్యారక్టర్ ని వైరల్లీ అనే యూట్యూబ్ చానెల్ లోని వెబ్ సిరీస్ లలో నటించిన ధీరజ్ చేస్తున్నాడు. ఇతడు ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనుభవం ఉంది.  నవ్వులు పూయిస్తున్న కెఎ పాల్ పాట

అయితే ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో ఒకడిగా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉందని ఇప్పటికే ధీరజ్ తెలిపాడు. కాగా వర్మ గతంలో కిల్లింగ్ వీరప్పన్, 9/11 ముంబై అటాక్స్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల్లో నిజజీవితంలోని పాత్రలను పోలిన వ్యక్తులను సినిమాలో చూపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం అందరికీ తెలిసిందే.