NBK107 First Hunt Teaser (Photo-Video Grab)

Hyderabad, OCT 07: ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలు చూసుకుంటూ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు నందమూరి బాలకృష్ష (Nandamuri Balakrishna). ఈ రెండు సరిపోవు అన్నట్టు బసవతారకం హాస్పిటల్ పనులతో కూడా ఎప్పుడు తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటాడు బాలయ్య. ఇంత బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా డిజిటల్ రంగంలోనూ దూసుకుపోతున్నాడు. మూడు సంవత్సరాల కింద ఆహాతో అన్ స్టాపబుల్ షో (Unstoppable With Nbk) మొదలుపెట్టాడు బాలకృష్ణ. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా (Unstoppable With Nbk ) ఎదిగింది ఇది. రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. తాజాగా మూడో సీజన్ కూడా రెడీ అవుతుంది. దసరాకు మొదటి ఎపిసోడ్ ప్లే కానుంది.

 

చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయంగా మరింత బిజీ అయిపోయిన బాలకృష్ణ.. ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు డిజిటల్ కూడా హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ తనకున్న 24 గంటల్లోనే టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటూ అన్నిచోట్ల ఆయనే కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆహా మేనేజ్‌మెంట్ అన్‌స్టాపబుల్ సీజన్ 3 కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే అన్ని టాక్‌షోలకు బాప్‌ అయిన అన్‌స్టాపబుల్‌ షో లిమిటెడ్‌ ఎడిషన్‌ తొందరలోనే తిరిగి రానుందని ఆహా మేనేజ్‌మెంట్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది. ఈ రెండు మూడు రోజుల్లోనే మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా జరగనుందని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దసరాకు ఇది లాంచ్ కావడం ఖాయం.