Ramayan on DD National, Mahabharat on DD Bharati (Photo Credits: Facebook)

New Delhi, Mar 28: ఇండియాలో క‌రోనా వైరస్ (Coronavirus in india) వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మన దేశంలో లాక్‌డౌన్ దెబ్బకు సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇక వారికి ప్రధాన వినోద సాధనంగా టీవీనే (TV) మారింది. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానళ్లు కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, పాత సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తూ ప్రజలను అలరిస్తున్నాయి.

ఇందులో భాగంగా ఇప్పటికే 1987 లో దూరదర్శన్‌లో (Doordarshan) ప్రసారమై ప్రజలను భక్తిభావంతో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణం (Ramayan) ధారావాహికను దూరదర్సన్ ఛానల్ శనివారం ఉదయం నుంచి ప్రసారం చేసింది. దీని 2వ భాగం ఈ రోజు రాత్రి ప్రసారం అవుతుంది.

రామాయణం సీరియల్ ను మార్చి28, శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణం ప్రసారమైన విషయం తెలిసిందే. మరో వైపు డీడీ భారతి (DD Bharati)లో మహాభారత్ (Mahabharat)ను ప్రసారం చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కోన్నారు. కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ రామాయ‌ణం వీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు.

Check Out Prakash' Tweet Below:

Here's Kajal Aggarwal 

టాలివుడ్ నటి కాజోల్ దూరదర్శన్ చానల్ లో ప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం చూస్తున్నానని అవి తనను బాల్యంలోకి తీసుకెళ్లాయని ట్వీట్ చేసింది.మొత్తం కుటుంబంతో క‌లిసి చూస్తున్నాం. ఇది మా ఫ్యామిలీ వీకెండ్ ప్లాన్. రామాయణం మ‌ళ్లీ ప్రారంభం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్ల‌లు భారతీయ పురాణాలను నేర్చుకోవడానికి ఇది గొప్ప మార్గం’ అంటూ ఆమె తెలిపారు.