Prabhas in Unstoppable With NBK (Pic@ Screen garb from viral video)

Hyderabad, DEC 11: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ (Unstoppable With NBK)టాక్ షో.. నెంబర్ వన్ టాక్ షోగా దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే అదిరిపోయే గెస్ట్ లను తీసుకు వచ్చిన ఆహా టీమ్, ఈసారి పాన్ ఇండియా గెస్ట్ పై కన్నేశారు. గత కొన్నిరోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి అతిధిగా రాబోతున్నాడు అంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ షో నిర్వాహకులు స్పెషల్ వీడియోని విడుదల చేశారు. దీంతో అధికారికంగా కూడా ప్రకటన వచ్చేయడంతో, కొత్త ఎపిసోడ్ పై భారీ హైప్ నెలకొంది. కాగా ఈ ఎపిసోడ్ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ డ్రెస్ సైజ్ అండ్ చెప్పులు సైజ్ ఏంటంటూ బాలయ్య ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ (Prabhas) తన కాలు సైజ్ గురించి చెప్పగానే.. “అంత సైజ్ ఉంటే వెంకటేశ్వర స్వామి పాదం అంటారు” అని బాలయ్య కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ లుక్స్ కూడా సూపర్ ఉన్నాయి. గెడ్డంతో, స్టైలిష్ హెయిర్ తో, ఫార్మల్ డ్రెస్ లో డార్లింగ్ అదుర్స్ అనిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ లుక్స్ పై విమర్శలు వస్తున్న సమయంలో ఇలా స్టైలిష్ గా కనిపించడంతో.. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కాగా ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ, ప్రభాస్ ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్‌లోనే ప్రభాస్ పెళ్లి (Prabhas marraige) గురించి క్లారిటీ ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు.

అంతేకాదు తన తదుపరి సినిమాల గురించి కూడా చెప్పే ఛాన్స్ ఉంది. ఇక అన్ స్టాపబుల్ షో కోసం గెస్ట్ గా వచ్చిన ప్రభాస్...వస్తూ వస్తూ పలు రకాల వంటలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు తనదైన శైలిలో భారీ ఎత్తున వంటలు తీసుకెళ్లాడు. ఇందులో భీమవరం స్పెషల్ వంటలైన మటన్, చికెన్, ఫిష్ కర్రీస్‌ను తీసుకెళ్లాడు.