Jabardasth comedian venu (Photo-Facebook)

సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని వాళ్లు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదని జబర్దస్త్ కమెడియన్ వేణు చెప్పుకొచ్చారు. కొండంత ప్రతిభ ఉన్నా గోరంత లక్‌ లేకపోతే వెండితెరపై వారు అదృష్టాన్ని పరీక్షించుకోలేరు. ఒక్క చాన్స్‌, ఒకే ఒక్క చాన్స్‌ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగేవారు అప్పటికీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. తాను కూడా ఒకప్పుడు ఇలా అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగానంటున్నాడు కమెడియన్‌ వేణు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్‌ వచ్చిందని పేర్కొన్నాడు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మార్షల్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాను. రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచాను. కానీ యాక్టర్‌ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అన్నదానాలు పెట్టిన చోట తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఎలాగైనా స్క్రీన్‌లో కనిపించాలని దొరికిన అన్ని పనులు చేశాను. టచప్‌ బాయ్‌గా, మేకప్‌ అసిస్టెంట్‌గా, సెట్‌ బాయ్‌గా, కూలీగా, పేపర్‌ బాయ్‌గా పని చేశాను. అంట్లు తోమడం దగ్గర నుంచి బాత్రూమ్‌లు కడగడం వరకు అన్నీ చేశాను.

జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అంశంపై ఏపీ సీఎంతో భేటీ అయిన దర్శకుడు రాజమౌళి

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కోసం అదే చిత్రపరిశ్రమలోని వ్యక్తులను పరిచయం చేసుకుని వాళ్ల రూమ్‌లో ఉన్నాను. కాకపోతే వాళ్లు నన్ను ఇంట్లో పని చేసే బాయ్‌గా ఉంచుకున్నారు. ఆ సమయంలో ఒకతని దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాను. కొంతకాలానికి యాక్టర్‌గానూ చేశాను' అని చెప్పుకొచ్చాడు కమెడియన్‌ వేణు.