Rashmi-Gautham-and-Sudigali-Sudheer (Photo-Twitter)

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. ఇద్దరూ అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు.ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్‌ ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్‌ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్‌ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని తెలిపింది. ఇక తాను నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సుధీర్‌ను మీరే గెస్ట్‌గా పిలిచారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సుధీర్‌ను పిలవాల్సిన అవసరం లేదు.

జబర్దస్త్‌లో నన్ను వాడుకుని అందరూ మోసం చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకీ చంటీ, బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ లేదంటూ ఘాటుగా..

ఎందుకంటే నేను పిలవకపోయినా అతడు వస్తాడు. మా మధ్య అలాంటి స్నేహం ఉంది. ఈవెంట్‌ ఉందని తనకి తెలుసు. నేను పిలవకపోయినా సుధీర్‌ వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పిలవలేదు, నందు గెస్టుగా పిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది.