jabardasth Fame varsha (Photo-Twitter)

ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం సాదాసీదా కామెడీ షో గా ప్రారంభం అయ్యి బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అయితే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం లేడీ కమెడియన్స్ అస్సలు ఉండేవారు. మెయిల్ కమీడియన్స్ ఫిమేల్ గెటప్స్ వేసుకుని కామెడీ పంచేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది లేడి కమెడియన్స్ కూడా జబర్దస్త్ లో హవా నడిపిస్తున్నారు.

ఇలాంటి వారిలో కూడా ఒకరు వర్ష (Jabardasth Varsha). జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది వర్ష. ముఖ్యంగా ఇమాన్యుయేల్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు గా నటించి ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో ఎంతోమంది స్కిట్ లలో చేస్తూ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను నవ్విస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల జబర్దస్త్ కార్యక్రమం గురించి వర్ష (jabardasth Fame varsha) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అమ్మ బీడీలు చుట్టి మమ్మల్ని సాకింది, జబర్దస్ట్ ఫేమ్ పైమా కన్నీటిగాథ, మా అమ్మకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే చాలంటన్న కమెడియన్ నటి

జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ అప్పటికప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినపుడు ఎక్కువగా టిఆర్పి రేటింగ్ కోసమే అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ అదంతా నిజం కాదు అంటూ చెబుతోంది వర్ష. నిజంగానే భావోద్వేగానికి గురి అవుతాము అంటూ చెప్పింది. ఇక తన సహ నటులంతా కూడా ఎంతగానో సహకరించారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ లోని కమెడియన్స్ మధ్య మంచి బంధం ఉంటుందని ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు స్పందిస్తారని చెప్పుకొచ్చింది. తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదు అంటూ చెప్పింది. జబర్దస్త్ వర్ష అంటూ అందరూ ఇచ్చే గుర్తింపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చింది..