Adithyan Jayan (Photo-Facebook)

మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు, సీత సీరియల్ ఫేం ఆదిత్య జ‌య‌న్ (Malayalam TV actor Adithyan Jayan)ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఆదివారం సాయంత్రం తన కారులో చేతి న‌రాలున క‌ట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి అపస్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో (Jayan allegedly attempts suicide) వెంట‌నే అత‌డిని త్రిచూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మ‌ణిక‌ట్టును కోసుకోవ‌డానికి ముందు అత‌డు అధిక మోతాదులో నిద్ర‌మాత్ర‌లు (sleeping pills) మింగాడ‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే బుల్లితెర న‌టి అంబిలి దేవి (Ambili Devi) త‌న భ‌ర్త ఆదిత్య జ‌య‌న్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అత‌డు త‌న‌ను మోసం చేశాడంటూ ఈ మ‌ధ్యే ఆమె మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆదిత్య త‌న‌కు విడాకులివ్వాల‌ని బ‌ల‌వంత‌పెడుతున్నాడని, చంపడానికి కూడా వెన‌కాడ‌న‌ని బెదిరిస్తున్నాడ‌ని పేర్కొంది. అయితే భార్య అంబిలి దేవి చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆదిత్య జ‌య‌న్ ఖండించాడు.

వ్య‌క్తిగ‌త విబేధాల‌ను దృష్టిలో పెట్టుకుని త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చొద్ద‌ని సూచించారు. ఇలా గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న సూసైడ్‌కు య‌త్నించ‌డం సంచ‌లనంగా మారింది. కాగా వీళ్లిద్ద‌రూ బుల్లితెర మీద 'సీత' అనే సీరియ‌ల్‌లో దంప‌తులుగా న‌టించారు. అదే స‌మ‌యంలో వీరు ప్రేమ‌లో ప‌డ‌గా 2019లో పెళ్లి పీట‌లెక్కారు. వీరికి అర్జున్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కాగా ఆదిత్య ప్ర‌స్తుతం ఎంటె మాత‌వు, సీతాక‌ల్యాణం సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

రాత్రి పూట తండ్రికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పూజా హెగ్డే, 60వ వడిలోకి అడుగుపెట్టిన పూజా తండ్రి మంజునాథ్‌ హెగ్డే, తండ్రి బర్త్‌డే పార్టీలో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన ముద్దుగుమ్మ

కాగా మలయాళ బుల్లితెర జంట అంబిలి దేవి, ఆదిత్యల వివాహం అప్పట్లో సంచలనమైంది. మూడు పెళ్లిళ్ల తర్వాత ఆదిత్య, మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి అంబిలి.. ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడు వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై అంబిలి దేవి స్పందిస్తూ.. తానిప్పటికీ ఆదిత్య భార్యగానే బతుకుతున్నానని చెప్పింది.

ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని అతడిని రెండో పెళ్లి చేసుకున్నా. నేను గర్భం దాల్చేవరకు మా జీవితం సంతోషంగా సాగింది. బెడ్‌ రెస్ట్‌ వల్ల నటనకు బ్రేక్‌ కూడా చెప్పాను. అప్పుడే లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఆ సమయంలో నా భర్త 13 ఏళ్ల కొడుకున్న మహిళతో రిలేషన్‌లో ఉన్నాడని తెలిసింది. మొదట్లో నేను నమ్మలేదు. నా భర్త అలాంటివాడు కాదని బలంగా విశ్వసించాను. తెలిసినవాళ్లు నాకు ఫోన్లు చేసి ఆమె గర్భం దాల్చింది అని చెప్తే దాన్ని కొట్టిపారేశాను".

"కానీ తర్వాత ఎంతోమంది నాకు ఫోన్‌ చేసి మళ్లీ అమ్మవి కాబోతున్నావట.. అంటూ విషెస్‌ చెప్తుంటే అయోమయానికి లోనయ్యాను. కానీ తర్వాత నెమ్మదిగా అంతా అర్థమైంది. అతడి వ్యవహారం బోధపడింది. ఇదే విషయాన్ని నిలదీస్తే అతడు విడాకులు కోరుతున్నాడు. నాకు విడాకులు అక్కర్లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, కలిసే ఉందాం అని చెప్పాను. కానీ అతడు ఆ మహిళే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆదిత్య ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు. కలిసుందాం అంటున్నా అతడు లెక్కచేయట్లేదు" అని అంబిలి వాపోయింది.