సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ద్వారా బాలీవుడ్‌లో డగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. అనేక మంది బాలీవుడ్ స్టార్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు (Narcotics Control Bureau) విచారించారు. అనంతరం డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ (NCB) ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ సీరియల్స్ నటి ప్రీతికా చౌహాన్(30) డ్రగ్స్ వినియోగం కేసులో (Preetika Chauhan drugs abuse) అరెస్టయ్యారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వర్సోవా, మచ్చిమార్ కాలనీలోని ఓ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె వ్యవహారంపై నిఘా పెట్టిన ఎన్సీబీ అధికారులు సివిల్ డ్రెస్సుల్లో నిఘా పెట్టారు. ఫైజల్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ ఆమె డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గంజాయిని కొనుగోలు చేస్తున్న ప్రీతికా చౌహాన్, విక్రేత ఫైజల్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆదివారం వారిద్దరిని కోర్టులో హాజరు పరిచారు. వీరికి నవంబర్ 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
రు.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రీతికా చౌహాన్ 2016లో విడుదలైన ‘జమీలా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. దేవోకి దేవ్ మహదేవ్, సంకట్ మోచన్ మహాబలి హనుమాన్, మా వైష్టోదేవీ, సంతోషీ దేవీ, సీఐడీ, సావ్‌ధాన్ ఇండియా వంటి పలు హిందీ సీరియళ్లలో ఆమె నటించారు.