బాలీవుడ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో (Sushant Singh Rajput Death Investigation) వెలుగులో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం బుధవారం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు (Rhea Chakraborty Granted Bail) మంజూరు చేసింది. పదిరోజుల పాటు పోలీష్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు (Bombay High Court) అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
అదే విధంగా గ్రేటర్ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు షరతు విధించింది. అయితే ఇదే కేసులో అరెస్టైన రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్, శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్‌లను హైకోర్టు బెయిలు నిరాకరించింది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో (Sushant Singh Rajput drug probe) వెలుగులో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతడి ప్రేయస రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె, సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో సెప్టెంబరు 9న అదుపులోకి తీసుకుని, బైకుల్లా జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో బెయిలు కోరుతూ రియా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా.. అనేక వాయిదాల అనంతరం హైకోర్టులో బుధవారం ఆమెకు ఊరట లభించింది. సుమారు నెల రోజుల తర్వాత ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది.
Here's Bollywood celebrities react to the verdict
Finally!!! She gets bail. #RHEACHAKRABORTY
— Anubhav Sinha (@anubhavsinha) October 7, 2020
Go get some rest girl. https://t.co/9t38rKWACV
— Hansal Mehta (@mehtahansal) October 7, 2020
🙏🙏🙏 @MumbaiHighCourt
— Soni Razdan (@Soni_Razdan) October 7, 2020
Hope her time in jail has sufficed the egos of a lot of people out there who in the name of justice for Sushant fulfilled their personal/professional agendas.Praying she doesn’t become bitter towards the life she has ahead of her.
Life is Unfair but Atleast it’s not over as yet. https://t.co/TGnbRZSL83
— taapsee pannu (@taapsee) October 7, 2020
Thank YOU YES! #BombayHighCourt https://t.co/3eUECzs4rJ
— Swara Bhasker (@ReallySwara) October 7, 2020
కాగా రియాకు బెయిల్ లభించడంపై బాలీవుడ్‌లోని పలువురు నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుభవ్ సిన్హా, సోని రజ్ధాన్, హర్హాన్ అక్తర్ వంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘చివరికి రియాకు బెయిల్ లభించింది’ అని అనుభవ్ ట్వీట్ చేశారు. జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్‌ను సోని రీట్వీట్ చేశారు. అలాగే బెయిల్ అందించినందుకు బాంబే హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రియా జైల్లో ఉన్న సమయంలో ఆమెకు మద్దతు తెలుపుతూ తనను విడుదల చేయాలని స్వరా భాస్కర్, రచయిత కనికా ధిల్లాన్ సహా పలువురు నటులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే
డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముంబై పోలీసులు మీడియాకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే మీడియా రియా చక్రవర్తి విషయంలో పరిమితికి మించి ఉత్సాహం కనబరిచి ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని పోలీసులు హెచ్చరించారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని సూచించారు. మీరు (జర్నలిస్టులు,రిపోర్టర్లు) సదరు సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించరాదని పేర్కొన్నారు.
నిజాలు బయటకు రావాల్సిందే, సుశాంత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్
వాహనాలను వెంబడించడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశాందర్ తెలిపారు. అలా చేయడం వల్ల మీ జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజల జీవితాలకు అపాయం కలుగుతుందని పేర్కొన్నారు. సెలబ్రిటీల వాహనాలను వెంబడించే క్రమంలో డ్రైవర్‌తో పాటు, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.