పటాస్ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్ట్ ప్రవీణ్ (Patas Praveen) తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో షేర్ చేసుకున్నారు. తల్లి ప్రేమ లేకుండానే బాల్యం అంతా గడిచిపోయిందని ఇంద్రజ (Indraja) పరిచయం అయ్యాక తనకు తల్లిలేని లోటు తీరందని భావోద్వేగంతో చెప్పాడు. వరంగల్లోని శ్రీరామగిరికి చెందిన ప్రవీణ్ కు తొమ్మిదేళ్ల అప్పుడే అమ్మ చనిపోయిందని ఆ తర్వాత మా తాత నన్ను చేరదీశారని తెలిపారు.
మా తాత డ్రామా ఆర్టిస్ట్. నన్ను కూడా డ్రామాలకు తీసుకెళ్లి చిన్న చిన్న వేషాలు వేయించేవారని అలా నాకు నటన మీద ఆసక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నా భవిష్యత్తు గురించి నాన్న అడిగితే సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పా. దానికి ఫుల్ సపోర్ట్ చేశారు. కానీ.. వెళ్లాల్సిన మార్గం తెలియదు. అప్పుడు నా అదృష్టం కొద్దీ పటాస్ ఆడిషన్స్ జరిగాయి. నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని పటాస్కు వచ్చానని అన్నారు. బుల్లితెరలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు ఇంద్రజ అండగా నిలిచారని అన్నారు.
ఇంద్రజను తన కారులో తిప్పడం ద్వారా అమ్మను ఎక్కించుకునే అదృష్టం తీరిందని భావోద్వేగంతో అన్నారు. కారు కొనడం ద్వారా తన తండ్రి కలను నెరవేర్చానని తెలిపారు. మా నాన్న, అన్న ఇద్దరూ ఆర్ఎంపీ డాక్టర్లుగా చేస్తున్నారు. వీరే నా ప్రపంచం. అమ్మ చనిపోయాక రెండో పెళ్లి చేసుకోమని బంధువులు నాన్నను ఒత్తిడి చేసినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. నాన్న నన్ను ఎలా చూసుకున్నారో.. నేను ఇప్పుడు ఆయనను అలా చూసుకోవాలని అనుకుంటానని చెప్పాడు.