సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె (Divyanka Tripathi) మాట్లాడుతూ.. 'ఒక సీరియల్ లేదా షో పూర్తి చేశాక మనకు అసలైన కష్టం మొదలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పుడు నాకు కట్టుకునే బిల్స్, ఈఎమ్‌ఐ ఇలా చాలానే ఉన్నాయి. చేతిలో డబ్బుల్లేక ఇంకా సరైన ఆఫర్లు రాక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఒక ఆఫర్ వచ్చింది.
నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా ఉన్నావంటే నీకు మంచి అవకాశం ఇస్తాడు అని! కానీ నన్నే ఎందుకిలా అడుగుతున్నారని ప్రశ్నిస్తే (Divyanka Tripathi opens up on casting couch experience) నేనొక తెలివైన అమ్మాయినని ఆన్సరిచ్చారు. ఇది మీటూ మూమెంట్ కన్నా ముందే జరిగింది. ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేవారు ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మీరు దానికి అంగీకరించకపోతే కెరీర్‌లో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. కానీ వాళ్లు మాత్రం మన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరింపులకు దిగుతారు. అయితే వారి ఆఫర్లకు, బెదిరింపులకు నేను లొంగను కాబట్టి దీన్నెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని తెలిపింది.
బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్‌గా తేజస్వి ప్రకాష్, అంగరంగ వైభవంగా బాలీవుడ్ గ్రాండ్ ఫినాలే
నా ప్రతిభను చూసే నాకు సీరియల్స్‌లో ఛాన్స్ ఇచ్చారు. నేను నా టాలెంట్‌నే నమ్ముకుంటాను' అని చెప్పుకొచ్చింది. దివ్యాంక.. 'బనూ మే తేరీ దుల్హాన్' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. 'యే హై మొహబ్బతే'లోనూ డాక్టర్ ఇషితా అయ్యర్ భల్లాలా నటించింది. 'నాచ్ బలియే 8'వ సీజన్‌లో పాల్గొన్న ఆమె ఈ డ్యాన్స్ షోలో విన్నర్‌గా అవతరించింది. 'ఖత్రోన్ కే ఖిలాడీ 11'వ సీజన్‌లో పార్టిసిపేట్ చేసి రన్నరప్‌గా నిలిచింది.