‘పల్సర్ బైక్’ అనే ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్సుతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిన గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ ల ద్వారా కూడా తెగ బిజీ అయిపోయింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అన్నింటిని తన ఇంటర్వ్యూ ల్లో పంచుకుంది.
ఇక ఝాన్సీ చిన్నప్పుడే తల్లి తండ్రులు గొడవపడి విడిపోయారు. ఝాన్సీ తన తల్లి, తమ్ముడిని తన డాన్సుతోనే కష్టపడి కుటుంబాన్ని పోషించింది. ఇక ఝాన్సీ తలకలి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. ఝాన్సీ ఎనిమిదో తరగతి నుండే డాన్స్ నేర్చుకుని స్టేజి పెర్ఫార్మన్స్ ద్వారా రోజుకు 150 రూపాయలు సంపాదించేది.
ఇక కండక్టర్ గా జాబ్ వచ్చాక కుటుంబ బాధ్యత తీసుకుని తమ్ముడిని ఎంబిఏ చదివించింది. తండ్రి వదిలేస్తే డాన్స్ చేసి కుటుంబాన్ని పోషించానని నేనేం తప్పు పని చేయలేదని, డాన్స్ చేసే అమ్మాయిలను తక్కువగా చూడకండి అంటూ చెప్పారు. ఇక ఝాన్సీ తన క్లాస్ మేట్ ను ఇంటర్ లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఝాన్సీ భర్త కూడా డాన్సరే. ఇద్దరూ కలిసి ఎన్నో కాంపిటిషన్స్ లోనూ పాల్గొన్నారు. జెమినీ టీవీ, మా టీవీ ఇలా చాలా ఛానెల్స్ డాన్స షోలలో పాల్గొన్నాడు.