Shaitan Trailer Out: పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలతో మరో వెబ్ సిరీస్, మహి వి. రాఘవ్‌ సైతాన్‌ ట్రైలర్ ఇదిగో, జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌
Shaitan Trailer Out

సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన యాత్ర మూవీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్‌ అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్‌ కాకుండా క్రైమ్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. తాజాగా సైతాన్‌ ట్రైలర్‌ విడుదలైంది. త‌నకు అన్యాయం చేసిన వారిపై బాలి అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

భోళాశంకర్‌ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్, మెగాస్థార్‌ మాస్‌ క్రేజ్‌కు తగ్గట్లు భోళా మ్యానియా సాంగ్‌

ట్రైలర్‌ ప్రారంభంలోనే ఒంటరిగా చూడమని హెచ్చరిస్తూ ఓ నోట్‌ పెట్టారు. అంటే ఇదేదో భయంకరమైన సిరీస్‌ అనుకునేరు.. అంతా బూతులమయంతో ఉంది. ఈ సమాజం నేనొక నేరస్థుడిని అన్నా సరే నేను బాధితుడిని' అంటూ హత్యలకు పూనుకుంటాడో వ్యక్తి. 'మనలో ఒకరిని కాపాడుకోవడం కోసం ఎవరినైనా, ఎంతమందినైనా చంపాల్సిందే' అన్న మహిళా డైలాగ్‌తో ఇందులో రక్తపాతం ఎక్కువే ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చే బూతు డైలాగులకు ఫ్యామిలీ ఆడియన్స్‌ చెవులు మూసుకోవడం ఖాయం.

Shaitan Trailer Out

రాజకీయ నాయకులకు, పోలీసులకు విశ్వాసం, కృతజ్ఞతల్లాంటివి ఉండవు అనే డైలాగులు మెరిసినప్పటికీ తర్వాత వరుసగా పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలే కనిపిస్తాయి. ఈ ట్రైలర్‌ చూసిన నెటిజన్లు ఇది రానా నాయుడుకు నెక్స్ట్‌ లెవల్‌లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఓటీటీలకు సెన్సార్‌ అనేది ఉండదా? మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటి? దీనికి బదులు అడల్ట్‌ సినిమాలు తీసుకోండి అని ఫైర్‌ అవుతున్నారు. ఇక ఈ సిరీస్‌ జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.