Mumbai January 22: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై (Mumbai)లోని ఓ 20 అంత‌స్తుల రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌ (20-stored residential building )లో భారీ అగ్నిప్ర‌మాదం (Huge Fire) సంభ‌వించింది. ఈ బిల్డింగ్‌లోని 18వ ఫ్లోర్‌లో ఉద‌యం 7 గంట‌ల‌కు ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది (Firemen) హుటాహుటిన ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్నారు. 13 ఫైరింజ‌న్ల‌తో మంట‌ల‌ను ఆర్పారు (firefighting operation). ఈ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెంద‌గా, మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలో ఉన్న భ‌టియా ఆస్ప‌త్రి (Bhatia Hospital)కి త‌ర‌లించారు. ఇందులో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన భ‌వ‌నాన్ని క‌మ‌లా బిల్డింగ్‌ (Kamla building)గా పోలీసులు గుర్తించారు.

అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన క‌మ‌లా బిల్డింగ్‌ను బీజేపీ ఎమ్మెల్యే మంగ‌ల్ ప్ర‌భాత్ లోధా (Mangal prabhath), ముంబై మేయ‌ర్ కిశోరి ప‌డ్నేక‌ర్ (Kishori Pednekar) ప‌రిశీలించారు. భ‌వ‌నంలో ఉన్న అంద‌రిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చామ‌న్నారు. పొగ‌లు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయ‌ని, దీంతో ఆరుగురు వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డార‌ని తెలిపారు. వారికి ఆక్సిజన్‌ను అందించేందుకు ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు.