Adipurush Movie Final Trailer (PIC@ T series)

Hyderabad, June 07: మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ (Adipurush) సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. మంగళవారం విడుదలైన పైనల్ ట్రైలర్ తో (Adipurush) అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎప్పుడెప్పుడు జూన్ 16 వస్తుందా అని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విపరీతమైన ట్రోల్స్ కు గురైంది. దాంతో చిత్రబృందం ఆరు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేసి వీఎఫ్ఎక్స్ పనులపై కాస్త సమయం కేటాయించింది. ఇక మూడు వారాల క్రితం రిలీజైన ట్రైలర్ ఒక్క సారిగా హైప్ ఎక్కించింది. టీజర్ తో వచ్చిన నెగెటివిటీ అంతా పటాపంచలైంది. దానికి తోడు జై శ్రీరామ్, రామ్ సీతా రామ్ పాటలు ఇన్ స్టాంట్ గా ఎక్కేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటల హవానే కనిపిస్తుంది.

Seat For Lord Hanuman: ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి ఓ సీటు రిజర్వ్.. రామ భక్తుల నమ్మకాన్ని గౌరవించేందుకేనని టీమ్ ప్రకటన.. ఈ నెల 16న తెలుగు సహా ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల 

ఇక మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో వేడుక జరిగింది. చిన్న జీయర్ స్వామి ముఖ్య గెస్ట్ గా వచ్చి సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాడు. లక్షమందికి పైగా అభిమానులు హాజరైన ఈ వేడుకలో ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఫైనల్ ట్రైలర్ (Adipurush Movie Final Trailer) మొత్తం యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పిచ్చే విధంగా అద్భుతంగా కట్ చేశారు.

రావణుడికి భిక్షం వేసేందుకు సీతాదేవి లక్ష్మణ రేఖ దాటగానే ఆమెను అపహరించుకునే వెళ్లే సీన్‌తో ప్రారంభమైన ట్రైలర్.. వానర సేన పోరాటం, హనుమంతుడి సాయం, రాముడి పరాక్రమాన్ని, దుష్ట రావణుడి అంతాన్ని చూపిస్తూ ఫైనల్ ట్రైలర్‌ను ఆసక్తిని పంచేలా కట్ చేశారు. ఈ విజువల్స్ 3డీలో చూస్తే మాత్రం వేరే లెవల్ అని స్పష్టమైపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహమే లేదు. ఇక ఫైనల్ ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్ లో పలు డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.