Ambulances rushed to Trichy airport (Photo Credit: X/@ANI)

Trichy, OCT 11: తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌ పోర్టులో ఎయిరిండియా విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. శుక్రవారం సాయంత్రం 5. 40 గంటలకు తిరుచ్చి నుంచి షార్జా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్‌ గుర్తించారు. హైడ్రాలిక్‌ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో AXB613 ఎయిరిండియా విమానం రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు సేఫ్‌ ల్యాడింగ్‌ కోసం ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. అంతకంటే ముందు.. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Air India Express Flight Declares Mid-Air Emergency Due to Hydraulic Failure Over Trichy

 

సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు. మిగతా విమానాలన్నీ ఇతర ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో హైఅలెర్ట్‌​ ప్రకటించారు. పెద్దసంఖ్యలో అంబులెన్స్‌, పారా మెడికల్‌ సిబ్బందని ఏర్పాటు చేశారు.

Ambulances Rushed at Airport

 

విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుచ్చి గగనతలంపై తిరుగుతున్న విమానం 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. హైడ్రాలిక్ వైఫల్యం గురించి పైలట్ తిరుచ్చి ఎయిర్ స్టేషన్‌ను అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు.