ఇద్దరు పసిపిల్లలను చంపి ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, అతని భార్య తన జీవితాన్ని ముగించుకున్న విషాద సంఘటన సోమవారం బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ 38 ఏళ్ల అనూప్, అతని భార్య 35 ఏళ్ల రాఖీ, వారి పిల్లలు ఐదేళ్ల అనుప్రియ, రెండేళ్ల ప్రియాంష్‌గా గుర్తించారు.
ఈ దంపతుల పెద్ద పాప అనుప్రియ ప్రత్యేక అవసరాలు గల బిడ్డ కావడంతో ఆ యువకుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఇంటి పనిమనిషి పోలీసులకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూప్ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి వరకు విషయాలు సాధారణంగానే ఉన్నాయని, దంపతులు సంతోషంగా ఉన్నారని పని మనిషి పోలీసులకు తెలిపింది.
Techie, Wife Die by Suicide After Killing Their 2 Children
4 members of the family were found #dead in the RMV area of #Bengaluru in a Rented house.
Deceased have been identified as
Anup Kumar 38 yrs (#Software Consultant),Rakhi 35,5 yr Female child & Boy 2 years.All are native of Allahabad #UP.Prima Facie suggests death by #suicide pic.twitter.com/TBfYY6NUZN
— Yasir Mushtaq (@path2shah) January 6, 2025
సోమవారం ఉదయం ఇంటికి వెళ్లిన పని మనిషికి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హత్య-ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. అనుప్రియ పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన దంపతులు తమ జీవితాలను అంతం చేసుకోవాలని, అంతకుముందే తమ పిల్లలను చంపాలని నిర్ణయం తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట తమ పిల్లలకు ఆహారంలో విషమిచ్చి చంపి, ఆ తర్వాత తమ నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.