Christmas Wishes Quotes In Telugu: సర్వలోక రక్షకుడు దేవాది దేవుడు రాజాధిరాజు అయినా యేసు ప్రభువు జన్మించిన పర్వదినమే క్రిస్మస్ వేడుక. ఈ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంబరాలతో జరుపుకుంటారు. ఈ ప్రపంచానికి దైవ సందేశాన్ని అందించేందుకు వచ్చిన ప్రవక్త ఏసుప్రభువు క్రైస్తవ మతాన్ని స్థాపించి బైబిల్ ప్రవచనాలతో ఈ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించారు. క్రైస్తవ సోదరులకు అత్యంత పవిత్రమైన క్రిస్మస్ వేడుక సందర్భంగా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే ఇక్కడ పేర్కొన్నటువంటి కొన్ని రకాల గ్రీటింగ్స్ తో మీరు వారిని క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. అలాంటి చక్కటి ఫుల్ క్వాలిటీ ఉన్న గ్రీటింగ్స్ అలాగే కొటేషన్స్ ఇక్కడ తెలుసుకుందాం.
ఆ కరుణామయుడు జీసస్ జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకగా జరుపుకునే క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు..
క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను -
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ జీవితంలో ఆనందాలు నింపాలని, శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.