ISRO Recruitment: డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇస్రోలో ఉద్యోగాలు, 327 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్న ఇస్రో, దరఖాస్తులకు చివరి తేదీ మరియు ఇతర వివరాలు తెలుసుకోండి
ISRO| (Photo Credits: PTI)

భారత ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనల కేంద్రం (ఇస్రో)లో ఖాళీగా ఉన్న 327 మంది శాస్త్రవేత్తలు లేదా ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నియామకాలు జరుగుతున్నాయి. ఇస్రో సెంటర్లలోని అటానమస్ విభాగంలో 10వ వేతన స్థాయిలోని గ్రూప్ 'ఎ' గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తి కోసం ఇస్రో ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందుకోసం అభ్యర్థులు BE / B.Tech చేసి ఉండాలి లేదా దానికి సమానమైన డిగ్రీ పూర్తి కలిగి కనీసం 65% మార్కులు లేదా సిజిపిఎ 6.84 /10 పాయింట్స్ సాధించిన వారు అర్హులు. వయసు నవంబర్ 04, 2019 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. కాగా, మాజీ సర్వీసు ఉద్యోగులకు మరియు దివ్యాంగులకు వయసులో కొంతవరకు సడలింపు ఉంటుంది.

ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ ద్వారా ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ isro.gov.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 04, 2019. ప్రతీ దరఖాస్తుకు రూ. 100 ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఛండీఘర్ లోని సెమీ కండక్టర్ లేబోరేటరీలో 'BE008' పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకునేవారు అదనంగా మరో రూ. 100 రుసుంతో దరఖాస్తు జతచేయాల్సి ఉంటుంది.

ఇస్రో రిక్రూట్మెంట్ 2019: ఖాళీ వివరాలు

ఎలక్ట్రానిక్స్ లో సైంటిస్ట్ / ఇంజనీర్: 131 పోస్టులు

మెకానికల్‌లో సైంటిస్ట్ / ఇంజనీర్: 135 పోస్టులు

కంప్యూటర్ సైన్స్ లో సైంటిస్ట్ / ఇంజనీర్: 58 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ అటానమస్ బాడీలో సైంటిస్ట్ / ఇంజనీర్: 3 పోస్టులు

ఇస్రో నియామకాలు 2019: ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్: అక్టోబర్ 15 నుండి నవంబర్ 4, 2020 వరకు

ఆఫ్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: నవంబర్ 4, 2020

పరీక్ష తేదీ: జనవరి 12, 2020

ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీ చెల్లింపునకు చివరి తేదీ నవంబర్ 4 కాగా ఆఫ్‌లైన్ ద్వారా ఏదైనా SBI బ్రాంచ్‌లో కూడా దరఖాస్తు రుసుం చెల్లించవచ్చు, ఇందుకు చివరి తేదీ నవంబర్ 6, 2019.

అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను రాత పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష 2020లో జనవరి 12న నిర్వహించబడుతుంది. రాత పరీక్ష కోసం ఇవ్వబడే ప్రశ్నాపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ రకం 80 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించిన అభ్యర్థులనే ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు, ఇంటర్వ్యూ పాస్ అయితే నేరుగా జాబ్ లోకి తీసుకుంటారు.