Hyderabad, Sep 16: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TET) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల ఫలితాలు (Exam Results) ఈ నెల 27న విడుదలకానున్నాయి.
TS TET 2023 | ఈ నెల 27న టెట్ ఫలితాల వెల్లడిhttps://t.co/VUk4DRr5Hk
— Namasthe Telangana (@ntdailyonline) September 16, 2023
చవితి తర్వాతే ప్రాథమిక కీ
టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్ లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి ప్రకారం తుది కీ ప్రకటిస్తారు.