
Hyderabad, Apr 30: తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేశారు. విద్యార్థులు ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08,385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.
