Exams Results

Hyderabad, Apr 30: తెలంగాణలో (Telangana) ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు (SSC Results) విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణ‌త సాధించారు. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3,927 స్కూల్స్‌ లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. అయితే టెన్త్ ఫెయిలైన విద్యార్థుల‌కు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌ల్లో మే 16వ తేదీ లోపు ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు 15 రోజుల పాటు అవ‌కాశం క‌ల్పించారు. రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేష‌న్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

టాప్ జిల్లాలు ఇవే

టెన్త్ ఫ‌లితాల్లో నిర్మ‌ల్ జిల్లా 99.05 శాతంతో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానంలో నిలిచింది. సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడు స్థానంలో నిలిచింది.