Afridi vs Gambhir:  కాశ్మీర్‌కు స్వేఛ్ఛ కల్పించాలన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది, 'పాక్ ఆక్రమిత కాశ్మీర్'కూ కల్పిస్తామని కౌంటర్ ఇచ్చిన గౌతమ్ గంభీర్

భారత్ - పాకిస్థాన్ రాజకీయ వ్యవహారాలు ఎంత వేడి పుట్టిస్తాయో. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ జరుగుతుందంటే కూడా ఆ హీట్ అలాగే కొనసాగుతుంది. అయితే, పాకిస్థాన్‌పై అటు రాజకీయంగా గానీ, ఇటు క్రికెట్‌లో గానీ ఎప్పుడూ భారత్‌దే పైచేయిగా నిలిచింది.

తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది,  కాశ్మీర్ (Jammu Kashmir) వ్యవహారంలో తలదూర్చాడు. భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏకంగా ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుందంటూ నిలదీశాడు. దీనికి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బిజేపి ఎంపీ గౌతమ్ గంభీర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

Shahid Afridi ట్వీట్ ఇది

" ఐక్యరాజ్యసమితి గతంలో చేసిన తీర్మానం మేరకు కాశ్మీర్ కు ఉండే హక్కులను అది కాపాడాలి. అందరిలాగే కాశ్మీర్ ప్రజలకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించాలి. కానీ ఇప్పుడు కాశ్మీర్‌లో మానవత్వాన్ని మంటగలిపేలా నేరాలు, దురాక్రమణలు జరుగుతున్నప్పటికీ, దానికి రక్షణ కల్పించాల్సిన ఐక్యరాజ్యసమితి నిద్రపోతుందా? అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ విషయంలో బాధ్యత

తీసుకోవాలి" అంటూ భారీ ట్వీట్ చేశాడు.

Gautam Gambhir కౌంటర్ ట్వీట్:

"అందరూ ఇక్కడ చూడండి మానవత్వాన్ని మంటగల్పిలా కాశ్మీర్‌లో నేరాలు, దురాక్రమణలు జరుగుతున్నాయని అఫ్రీది చెప్తున్నాడు. ఈ విషయం అందరి దృష్టికి తెచ్చినందుకు మనందరం అతణ్ని అభినందించాలి. అయితే ఇవన్నీ జరుగుతున్నవి 'పాక్ ఆక్రమిత కాశ్మీర్' లోనే అని చెప్పడం మరిచిపోయాడు. అయినా సరే, సమస్యేం లేదు త్వరలోనే అక్కడ కూడా అన్నీ సరిచేస్తాం" అంటూ నేరుగా అతడికే గౌతమ్ గంభీర్ రీట్వీట్ చేశాడు.