Newdelhi, Aug 23: జనబాహుళ్యంలో సరఫరా అవుతున్న 156 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) (FDC Drugs) మందులపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది. వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎఫ్‌డీసీ మందులపై బ్యాన్ విధించినట్టు వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం తాజాగా జారీ చేసింది. జ్వరం, జలుబు, అలెర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీబ్యాక్టీరియల్ మందులు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి.
The govt banned 156 fixed-dose combination medicines, including antibiotics used for fever and colds, painkillers, and multivitamins, saying that they are ‘likely to involve risk to human beings’https://t.co/jbPNpAKVzE
— Mint (@livemint) August 22, 2024
ఏమిటీ ఎఫ్‌డీసీ మందులు?
రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో కలగలిపిన మిశ్రమ మందులను ఎఫ్‌డీసీ మందులు అంటారు. వీటిని కాక్ టెయిల్ డ్రగ్స్ (Cocktail Drugs) అని కూడా పిలుస్తారు.