source: pixabay

అరటిపండు నిజానికి చాలా పోషకాలు ఉన్న పండు ఇందులో అనేక రకాల పోషకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే అరటిపండు మాత్రమే కాదు పచ్చి అరటికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అరటికాయలు కేవలం కూర చేసుకోవడానికి మాత్రమే అనుకుంటారు. కానీ అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్న అరటి కాయలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు- ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఏవి కూడా ఫలించడం లేదు అటువంటి వారు పచ్చి అరటికాయను తిన్నట్లయితే అందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ఆకలిని తగ్గిస్తుంది, తక్కువ తినేలాగా చేస్తుంది కాబట్టి క్రమంగా బరువు తగ్గుతారు.

యాంటీ ఆక్సిడెంట్లు- పచ్చి అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అనేక రకాల జబ్బులను రాకుండా చూస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి జబ్బులను ప్రమాదాన్ని తగ్గించడంలో పచ్చి అరటి సహాయపడుతుంది.

Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.

జీర్ణ క్రియ- పచ్చి అరటి తీసుకోవడం వల్ల ఫ్రీ డయాబెటిక్ ప్రభావం తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఫెనోలిక్ లో సమృద్ధిగా ఉంటాయ. ఇది మంచి బ్యాక్టీరియా మన పొట్టలోని ప్రేగులను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. పచ్చి అరటిన్ తీసుకోవడం ద్వారా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.

గుండెకు మంచిది- పచ్చి అరటి తిన్నట్లయితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు పచ్చి అరటి సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి