
చాలా మందిలో పెళ్లి జరిగి చాలా కాలం అయినప్పటికీ పిల్లలు పుట్టరు. వారు పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. పిల్లల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వారి బాధని మాటల్లో వర్ణించలేము. అయితే పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఆడవారిలో, మగవారిలోనూ ఇద్దరిలోనూ ఉంటుంది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సంతానం కలగడం అనేది ఆలస్యం అవుతుంది. ఒక మిల్లీ లీటర్ స్పెర్మ్‌లో 15 మిలియన్లకు పైగా శుక్రకణాలు ఉన్నప్పుడే పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవచ్చునని అంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
>> బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల అవి వీర్య కణాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేవు. పడుకునేముందు బిగుతుగా ఉండే ప్యాంట్లకు బదులు వదులుగా షార్ట్స్ లాంటివి వేసుకోవడం మంచిది.
>> ఇక మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదు..
>> రోజుకు ఎనిమిది గంటల నిద్ర ఉంటే మంచిదని అంటున్నారు. నిద్రలేమి వల్ల కూడా వీర్య ఉత్పత్తి తగ్గుతుందట
>> ఒత్తిడి వల్ల సెక్స్ సామర్ధ్యం తగ్గుతుందని దానివల్ల వీర్య ఉత్పత్తి కూడా తగ్గుతుందని అంటున్నారు. కాబట్టి ఒత్తికి దూరంగా ఉండాలి.
>> ఇక రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తి అవుతుందట.
>> పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం వంటివి మానేయాలని, పొగ త్రాగే వారిలో 22 శాతం వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతుందట.
>> ఇక ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి రోజుకు రెండు పెగ్గులు తాగే వారిలోనూ వీర్యం ఉత్పత్తి తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.