New Delhi, December 27: ఛార్జీలను సవరించే ప్రక్రియను రైల్వేశాఖ (Indian Railways) ప్రారంభించిన నేపథ్యంలో రెలు టికెట్ ధరలు (Passenger Fares) మరియు సరుకు రవాణా ఛార్జీల (Freight Charges) పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా ఆదాయం పెంచుకునే మార్గాలను అణ్వేషిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆదాయం వచ్చే రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రైల్వేశాఖ ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు టికెట్ ధరలను పెంచే ఆలోచనలు చేసినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. గత నెలలోనే టికెట్ ధరలు పెంచే విషయంపై ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు సూచనలు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఊహాగానాలను బలపరిచేలా రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే సింగ్ హింట్ ఇచ్చారు. రైలు టికెట్ ధరలను 'హేతుబద్దీకరించే' (Rationalize) ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, "ప్రయాణికుల ఛార్జీలు మరియు సరుకు రవాణా రేట్లను హేతుబద్ధీకరించబోతున్నాం. దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇది సున్నితమైన అంశం కాబట్టి వివరాలు ఇప్పుడే వెల్లడించలేము. అని తెలిపారు.
నివేదికల ప్రకారం, టికెట్ ధరలు కిలోమీటరుకు 5 నుండి 40 పైసలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
రైల్వే ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ 'ఛార్జీలను హేతుబద్ధీకరించడం' అంటే టికెట్ ధరలు పెరుగుతాయనే కాదు. ఛార్జీలు తగ్గే అవకాశమూ లేకపోలేదని పేర్కొన్నారు. అయితే, రైల్వేశాఖ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆయన అంగీకరించారు. 13 లక్షల మంది ఉద్యోగుల పెన్షన్‌తో కలిపి రైల్వేశాఖ ఖర్చుచేసే వ్యయం అంచనా రూ. 2.18 లక్షల కోట్లు కాగా, రైల్వే శాఖ నుంచి వచ్చే ఆదాయం సుమారు రూ. 2 లక్షల కోట్లుగా ఉందని చెబుతున్నారు. గాలి నుంచి మంచి నీరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు, లీటర్ వాటర్ కేవలం రూ. 5 మాత్రమే!
రైల్వే ద్వారా వచ్చే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉండటం మూలానా ప్రయాణికుల నుంచి లేదా సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంపై రైల్వేశాఖ దృష్టి సారిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు అని అధికారులు అంటున్నారు.