Aadhaar Seeding With Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆధార్‌తో రేషన్‌కార్డు లింక్ గడువు పొడిగింపు, జూన్ 30 వరకు తేదీ పొడిగించిన శాఖ, రేషన్ కార్డుకు ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసా?
Rationcards (Photo Credits: IANS| Representational Image)

New Delhi, March 25: దేశంలో రేషన్ కార్డుదారులకు (Ration Card holders) పెద్ద ఉపశమనం కలిగించే విధంగా రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం (Aadhaar seeding) గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 30 వరకు కార్డుదారులు రేషన్ సరఫరాలను పొందడంతో పాటు ఇతర పధకాలను, ప్రభుత్వ సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు చివరి తేదీని (Last Date) మార్చి 31, 2022గా నిర్ణయించారు. ప్రస్తుతం చివరి తేదీని సవరించడంతో 2022 జూన్ 30 నాటికి లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను ఆధార్ లింక్ (Aadhaar link)చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డు’ పథకాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్ కార్డుదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులను పొందవచ్చు. వీటితో పాటుగా కేంద్రం అందించే అనేక పధకాలను రేషన్ కార్డుదారులు పొందుతున్నారు.

Google's Android App: గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం

రేషన్ కార్డు ఆధార్ తో అనుసంధానించాలనుకునేవారు.. ఆధార్ అధికారిక వెబ్ సైట్ uidai.gov.in ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఇక్కడ ‘స్టార్ట్ నౌ’ మీద క్లిక్ చేయండి. జిల్లా మరియు రాష్ట్రం పేరుతో సహా మీ చిరునామా వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత ‘రేషన్ కార్డు బెనిఫిట్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఇమెయిల్ (E mail)చిరునామా మరియు మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి.ఈ విధంగా చేసిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటిపి వస్తుంది. మీరు OTPని ఎంటర్ చేసినప్పుడు, మీ స్క్రీన్ మీద ప్రాసెస్ కంప్లీషన్ అనే మెసేజ్ వస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీ ఆధార్ వెరిఫై చేయబడుతుంది. అది మీ రేషన్ కార్డుతో లింక్ చేయబడుతుంది.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్, యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ ఎవరికైనా ఫార‍్వడ్‌ చేస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే

ఆఫ్ లైన్ లో ఆధార్ తో రేషన్ కార్డును ఎలా లింక్ చేయాలి

రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయడానికి, అవసరమైన పత్రాలను రేషన్ కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లలో ఆధార్ కాపీ, రేషన్ కార్డు కాపీ మరియు రేషన్ కార్డు హోల్డర్ యొక్క పాస్ పోర్ట్ సైజు ఫోటోలు ఇవ్వాలి. మీ ఆధార్ యొక్క బయోమెట్రిక్ డేటా వెరిఫికేషన్ కూడా రేషన్ కార్డు కేంద్రంలో చేయవచ్చు