ఇప్పటివరకు ఏడాదికి రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను (Income Tax) నుంచి మినహాయింపునిచ్చింది.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంది మధ్య తరగతి వారికి సైతం ఏడాదికి రూ. 5 లక్షల పైగానే ఆదాయం ఉన్నా, అది ఎంత మాత్రం సరిపోవడం లేదు.  ప్రధాన నగరాలలో Deducదీంతో కష్టజీవులు ఈ ఆదాయపు పన్ను నుంచి ఆదా చేసుకోడానికి వివిధ మార్గాలను అణ్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ ల మీద, దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఆధారపడుతున్నారు.

అయితే ఇవే కాకుండా మరికొన్ని మార్గాల ద్వారా ఈ ఆదాయపు పన్ను నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఐటీ సెక్షన్లు 80C, 80TTA, 80TTB, 80CCC, 80G, 80CCD ల ద్వారా మన కట్టే ఆదాయం పన్ను నుంచి కొంతవరకు రాబట్టుకోవచ్చు. వీటి వివరాలు ఇలా ఉన్నాయి.

సెక్షన్ 80C:

ఆదాయపు పన్ను కట్టే ఉద్యోగస్తుడైనా లేదా వ్యాపారం చేసుకునే వారైనా ఈ సెక్షన్ ద్వారా రూ. 1.5 లక్షల వరకు కట్టిన పన్నుని తిరిగి పొందవచ్చు. అయితే టాక్స్ పేయర్ PPF లేదా NSC లలో వారు చేసిన ఇన్వెస్ట్ మెంట్ వివరాలను అందించాల్సి ఉంటుంది.

Section 80TTA:

ఏదైనా సేవింగ్స్ అకౌంట్, సహాకార సొసైటీ లేదా పోస్ట్ ఆఫీసుల్లో డబ్బు పొదుపు చేస్తుంటే దానిపై గరిష్ఠంగా రూ. 10 వేలు రాబట్టుకునే వీలుంటుంది. మీరు డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా వచ్చే వడ్డీ మీ ఆదాయం పెరుగుదలకు ఒక కారణంగా ఈ సెక్షన్ 80TTA ద్వారా చూపించుకోవచ్చు.

అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లకు, ఆర్ డీ మరియు కార్పోరేట్ బాండ్ల మీద వచ్చే వడ్డీకి ఇది వర్తించదు.

సెక్షన్ 80TTB:

2018 వార్షిక బడ్జెట్ లో ఈ సెక్షన్ ను ప్రవేశపెట్టారు. ఇది కూడా సెక్షన్ 80TTA లాంటిదే. సీనియర్ సిటిజన్ అకౌంట్లో జమ చేయబడిన డిపాజిట్లను ద్వారా రూ. 50 వేల వరకు తిరిగిపొందే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కాం టాక్స్ రిటర్న్ లు సమర్పించేటపుడు 80TTA లేదా 80TTB లో ఏదో ఒక దానిని మాత్రమే చూపించే వీలుంది. 80TTB పత్రం సమర్పించిన తర్వాత 80TTA ద్వారా రిటర్నులు పొందటానికి వీలు లేదు.

సెక్షన్ 80CCC:

ఈ సెక్షన్ ద్వారా టాక్స్ చెల్లింపుదారుడు ఏదైనా వార్షిక ఇన్సూరెన్స్ ప్లాన్ కు సంబంధించి డబ్బు కడుతుంటే, దానిలో నుంచి కొంత రిబేట్ తీసుకునే అవకాశం కలుగుతుంది. అయితే దీనికి సెక్షన్ 10(23AAB)లో చెప్పిన విధంగా కొన్ని పరిమితులు ఉన్నాయి.

Section 80CCD:

పన్ను చెల్లింపుదారుడు ఎవరైనా పెన్షనర్ ఖాతాలో డబ్బు జమచేస్తుంటే 10% టాక్స్ మినహాయింపును పొందవచ్చు. గరిష్ఠంగా 1 లక్షా 50 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు.

విరాళాలు ఇస్తే 50% లేదా పూర్తి పన్ను మినహాయింపు.

ఈ సెక్షన్ ద్వారా ఏదైనా చారిటీకి దాతగా వ్యవహరిస్తే లేదా ప్రభుత్వానికి సంబంధించిన స్కీములకు రిలీఫ్ ఫండ్లు అందజేస్తే దానిపై 50% లేదా పూర్తిగా పన్ను మినహాయింపునిస్తారు. అయితే ఆ విరాళాలకు కొంత పరిమితి ఉంటుంది. ఆ విరాళాలు ఐటీ సెక్షన్లకు లోబడి ఉండాలి.

ఇంటి అద్దె చెల్లిస్తూ ఉంటే..

పన్ను చెల్లింపుదారుడు ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లయితే HRA నుంచి టాక్స్ మినహాయింపు ఉంటుంది. ఏడాదికి గరిష్థంగా 2 లక్షల 50 వేల వరకు సెక్షన్ 80GG ద్వారా ఇంటి అద్దెకు టాక్స్ మినహాయించుక్ఫోవచ్చు. అయితే మీరు అద్దె ఉంటున్నట్లు ఇంటి యజమాని నుంచి ధృవీకరణ పత్రం అందజేయాలి. ఇంటి అద్దె ఏడాదికి రూ. లక్ష దాటితే పాన్ కార్డ్ వివరాలు అందజేయాలి.

విద్య కోసం ఫీజులు చెల్లిస్తే..

పన్ను చెల్లింపు దారుడు తమ పిల్లలకోసం లేదా సంరక్షుల కోసం విద్యారుణం తీసుకొని ఉంటే సెక్షన్ 80E ద్వారా దానిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని గరిష్ఠ కాలపరిమితి 8 సంవత్సరాలు.

హోం లోన్

ఇంటి నిర్మాణం కోసం ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే అందుకు సెక్షన్ 80EE ద్వారా తీసుకున్న మొత్తానికి టాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇందుకు ఇంటి యజమాని లేదా వారి జీవిత భాగస్వామి ఎవరో ఒకరు మాత్రమే అర్హులు. అయితే దాని విలువ 50 లక్షలకు మించరాదు.

కుటుంబ ఆరోగ్య బీమా

పన్ను చెల్లింపుదారుడు తన కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా చేయించుకున్నట్లయితే సెక్షన్ 80D ద్వారా రూ. 25 వేల వరకు తిరిగి పొందవచ్చు. ఒక వేళ వయసు 60 సంవత్సరాలు దాటితే గరిష్ఠంగా 50 వేల వరకు తిరిగి పొందే వీలుంటుంది.